: అనంతపురం జిల్లాలో ఆకస్మిక బంద్ కు పిలుపు


తెలంగాణ నోట్ నేపథ్యంతో సీమాంధ్ర రగులుతోంది. నోట్ ప్రవేశపెడుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో సమైక్యాంధ్రవాదులు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఆకస్మిక బంద్ కు పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు బంద్ కు మద్దతు పలికారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి దిష్టిబొమ్మలను తగులబెడుతున్నారు. నోట్ నేపథ్యంలో అనంతపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్, కదిరి తదితర ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. రాజకీయనాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి విభజన ప్రక్రియకు తోడ్పడుతున్నారని సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. ఎస్ కే యూనివర్సిటీ వద్ద దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు చెన్నై రహదారిపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News