: బాలీవుడ్ సింగర్ కు బెదిరింపు ఫోన్ కాల్స్


అండర్ వరల్డ్ డాన్ చోటా షకీల్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ లో అతను ఓ సభ్యుడని చెప్పాడు. ఇప్పటికే తనకు అనేకసార్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. తన వరల్డ్ టూర్-2014 పర్యటనను నిర్వహించబోయే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నాడని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అవసరమైతే పోలీసు రక్షణ కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News