: మరికాసేపట్లో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల కీలక భేటీ


సమైక్య ఉద్యమంలో భాగంగా భిన్న గళాలు, భిన్న దారులుగా విడిపోయిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ హైదరాబాదులో కాసేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ తీర్మానానికి కట్టుబడటమా? లేక మరో మార్గంలో వెళ్లి అధిష్ఠానాన్ని ఒప్పించుకోవడమా? అనే విషయాన్ని తేల్చుకోవడానికి నేతలంతా భేటీ కానున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోని క్లబ్ హౌస్ లో ఉదయం 11 గంటలకు వీరు భేటీ అవుతున్నారు. సీఎం అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయనే వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం విశేషం.

  • Loading...

More Telugu News