: హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 15 వ తేదీ వరకు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్టు నల్గొండ పోలీసులు తెలిపారు. 65వ నంబరు జాతీయ రహదారిపై కోల్ కతా, విశాఖపట్నం వెళ్లే వాహనాలను సూర్యాపేట, ఖమ్మం మీదుగా... చెన్నై వైపు వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి, అద్దంకి మీదుగా దారి మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.