: ముంబై ట్రాఫిక్ లో చిక్కుకున్న యువరాజు


ఆదర్శ్ కుంభకోణంతో మహారాష్ట్రలో ఎన్.సీ.పీ పట్టు కోల్పోతున్న తరుణంలో... పార్టీని బలోపేతం చేసేందుకు ముంబై వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ విమానాశ్రయం నుంచి బయలు దేరారు. అది రద్దీ సమయం కావడంతో ఎనిమిది నిమిషాల పాటు రాహుల్ గాంధీ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. 

అయితే తన పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని రాహుల్ గాంధీ సూచించారని.. అందువల్లే ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చిందని సమాచారం. 2014 సాధారణ ఎన్నికల సమయానికి పార్టీ గాడిలో పడేందుకు ఇవాళ రాహుల్ గాంధీ  ముంబైలో తనవంతు ప్రయత్నం చేయనున్నారు.

  • Loading...

More Telugu News