: దీనితో దీర్ఘాయుష్మాన్‌భవ...


మీరు చిరకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలనుకుంటే మాత్రం ఈ విటమిన్‌ను తగు మోతాదులో తీసుకుంటే చాలట. బి విటమిన్‌ కుటుంబంలోని బి-3 (నియాసిన్‌) విటమిన్‌ను తీసుకుంటే సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా జీవించవచ్చని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. ఈ విటమిన్‌ మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని, శరీరం వ్యాయామం చేసేలా భ్రమింపజేస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది.

ఈటీహెచ్‌ జ్యూరిచ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఏలికపాములపై నియాసిన్‌ విటమిన్‌తో కూడిన ఆహారాన్ని అందించి వాటిపై అధ్యయనం చేశారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఏలికపాము సాధారణ జీవితకాలంకన్నా ఎక్కువ కాలం జీవించినట్టు వీరి పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త రిస్టో మాట్లాడుతూ నియాసిన్‌ వ్యాయామం తరహా జీవక్రియా పరిస్థితిని కలిగిస్తోందని, శరీరం వ్యాయామం చేస్తున్నట్టుగా భ్రమింపజేస్తుందని తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు మనుషులకు కూడా వర్తిస్తాయని, నియాసిన్‌ నికోటినమైడ్‌గా మారడం వల్లే ఈ ప్రయోజనాలు కలుగుతున్నట్టు రిస్తో వివరించారు. నియాసిన్‌ను ఆహార సప్లిమెంట్లుగా తీసుకోవడం ఎప్పటినుండో ఆమోదంలో ఉందని రిస్టో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News