: సెమీస్ లో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్
ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. పెర్త్ స్కార్చర్స్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు సెమీస్ కు అర్హత సాధించింది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 51 పరుగులతో నాటౌట్ గా నిలిచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ 25 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 48 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు సహకారం అందించాడు.