: నేరచరితులపై ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకున్న కేంద్రం
నేరచరిత గల ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ వెంటనే ఉపసంహరణ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు. కొద్దిసేపటి కిందట జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ అటార్నీ జనరల్ వాహనవతి సలహా కూడా తీసుకున్నారు. ఆర్డినెన్స్ పై ఈ ఉదయం కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా సమావేశమై చర్చించింది. అంతేగాక భాగస్వామ్య పక్షాలతోనూ ప్రధాని చర్చించారు. ఆర్డినెన్స్ అర్ధరహితమని రాహుల్ వ్యాఖ్యానించిన తర్వాత కేంద్రం వెనక్కి తగ్గడం గమనార్హం.