: అందరూ మెచ్చే సంస్థ 'ఆపిల్'!
నేటి కంప్యూటర్ జనరేషన్ లో 'ఆపిల్' పేరు తెలియనివారెవ్వరు? పర్సనల్ కంప్యూటర్ల తయారీదారుగా ప్రసిద్ధిచెందిన ఈ సంస్థ 'ఐపాడ్' తో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. ఇక ఐఫోన్ తో యువతరం హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడా ఆపిల్ సంస్థ ప్రపంచంలోనే వ్యాపార వర్గాలు అత్యధికంగా ఇష్టపడే సంస్థగా ప్రథమస్థానంలో నిలిచింది.
ఈ ఘనత సాధించడం ఆపిల్ కు ఇది వరుసగా ఆరోసారి. ఫార్చూన్ మ్యాగజైన్ నిర్వహించిన ఓ సర్వేలో ఆపిల్ కు అందరూ జై కొట్టారు. ఇక గూగుల్, అమెజాన్, కోకాకోలా, స్టార్ బక్స్, ఐబీఎమ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయట. ఉత్పత్తుల నాణ్యతలో రాజీలేని ధోరణే ఆపిల్ కు ఈ స్థాయి సాధించిపెట్టిందని అత్యధికులు అభిప్రాయపడ్డారు.