: రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోంది: పయ్యావుల


రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు టెన్ జన్ పథ్ (సోనియాగాంధీ నివాసం)లో కుట్ర జరుగుతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని చీల్చేందుకు సొంత పార్టీలోనే సోనియా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు షట్ డౌన్ ప్రకటించాలని హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పయ్యావుల డిమాండ్ చేశారు. హైదరాబాదులో సమైక్య సభతో శాంతిభద్రతల విఘాతానికి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ వ్యూహం పన్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News