: సీబీఐ తీరు అనుమానాస్పదం: టీడీపీ ఎన్ఆర్ఐ నేతలు
జగన్ బెయిలు విషయంలో సీబీఐ, ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని టీడీపీ ఎన్ఆర్ఐ నాయకులు ఆరోపించారు. కాలిఫోర్నియాలో శ్రీనివాస్ కొమ్మినేని మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన రామలింగరాజు, మధుకోడా, హసన్ అలీలకు మూడేళ్లకు పైగా రాని బెయిల్, జగన్ కు 16 నెలలకే రావడంతో సీబీఐ తీరు అర్థమవుతోందని అన్నారు. జగన్ కేసు నీరుగార్చేవిధంగా ఉన్నతాధికారులను బదిలీ చేసిందని ఆయన అన్నారు. జగన్ ను జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. జగన్ నేరాలు నిరూపితమైతే ఆయన అక్రమార్జన మొత్తాన్ని జాతీయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని గౌరీ సుధ అన్నారు. రాబోయే ఎన్నికలు నీతి, అవినీతి మధ్య జరుగుతున్న పోరని అభివర్ణించారు. అంతిమ విజయం టీడీపీదేనని అన్నారు.