: డొక్కా నివాసం ముట్టడి.. సీఎంపై వ్యాఖ్యల ఫలితం


గుంటూరులో మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నివాసాన్ని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ముట్టడించింది. డొక్కా సీఎం కిరణ్ కు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు విభజనకు అనుకూలంగా ఉన్నాయని జేఏసీ ఆరోపించింది. ఈ ఉదయం డొక్కా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హైకమాండ్ నిర్ణయాన్ని ఎలా ధిక్కరిస్తారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారని కూడా డొక్కా వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, సీఎం ఒక ప్రాంతం గురించే మాట్లాడితే, అది సమైక్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల పట్ల సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News