: రాహుల్ డ్రామాలాడుతున్నారు: బీజేపీ
చట్టసభల్లో నేరచరితుల ప్రవేశానికి వీలు కల్పించే ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ తీసుకురావడం, దాన్ని రాహుల్ గాంధీ ఖండించడం.. అంతా ఓ డ్రామా అని బీజేపీ ఆరోపించింది. ఈ వివాదాస్పద ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యాఖ్యలు పరోక్షంగా ప్రధానిని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో అన్నారు. ఈ ఆర్డినెన్స్ పై గొంతు చించుకున్న రాహుల్.. 2జీ స్కాం, బొగ్గు కేటాయింపులు, కామన్వెల్త్ కుంభకోణాలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ లక్ష్యంగా తాము ఎన్నోసార్లు విమర్శలు గుప్పించినా, ప్రధానిని అవమానపరచలేదని స్పష్టం చేశారు.