: నోబెల్ రేసులో పుతిన్
రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ పేరును 2014 నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. సిరియా మీద అమెరికా క్షిపణి దాడి జరగకుండా అడ్డుకున్నందుకు, డమాస్కస్ లో రసాయన ఆయుధాల వాడకాన్ని నివారించినందుకు ఆయన పేరును శాంతి బహుమతికి ప్రతిపాదించినట్టు సమాచారం. 'ద ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ స్పిరిచ్యువల్ యూనిటీ అండ్ కో ఆపరేషన్ ఎమాంగ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్' సంస్థ ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు నోబెల్ ప్రైజ్ కమిటీకి ఆ సంఘం సెప్టెంబర్ 16న లేఖ పంపినట్టు తెలిపింది.