: పెట్రోల్ బంకుల్లో త్వరలో గ్యాస్ సిలిండర్ల అమ్మకం


దేశంలోని మెట్రో నగరాల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ఐదు కేజీల గ్యాస్ సిలిండర్లను విక్రయించనున్నారు. ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, బెంగళూరు మెట్రో నగరాల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఐదు కిలోల సిలిండర్ల విక్రయాన్ని బెంగళూరులో ఈ నెల 5న పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రారంభించనున్నారు. మెట్రో నగరాలకు వచ్చే విద్యార్ధులు, ఉద్యోగులకు చిన్న సిలిండర్లు ఎంతో ఉపయుక్తమని చమురు సంస్థలు పేర్కొంటున్నాయి. త్వరలో దేశంలోని 30 నగరాల్లో ఎల్పీజీ పోర్టబిలిటీకి అవకాశం కల్పించనున్నారు. దాంతో, హెచ్ పీ, ఇండేన్, బీపీ కంపెనీల వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీకి మారే అవకాశం కలుగుతుంది.

  • Loading...

More Telugu News