: రాష్ట్రపతితో ముగిసిన ప్రధాని భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆర్డినెన్స్ అంశంపై కూలంకషంగా చర్చించారు. అమెరికా పర్యటన వివరాలను కూడా ప్రధాని రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు జరిగే కేబినెట్ భేటీలోనూ ఆర్డినెన్స్ పై చర్చించి.. ఆ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం తీసుకోనున్నారు.