: వాళ్ళిద్దరూ జనావాసాల్లో ఉండడం మంచిది కాదు: కడియం
టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావులపై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి మండిపడ్డారు. వీరిద్దరికీ మతి స్థిమితం లేదని విరుచుకుపడ్డారు. పిచ్చాసుపత్రుల్లో ఉండాల్సిన వారు జనావాసాల్లో ఉండటం మంచిది కాదన్నారు. కేసీఆర్ పై నిన్న మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎర్రబెల్లి, మోత్కుపల్లి తమ ప్రవర్తనను మార్చుకోకపోతే... భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. ఎర్రబెల్లి అక్రమాస్తులపై నివేదిక ఇస్తామని కడియం తెలిపారు.