: వైఎస్సార్సీపీకి ఢిల్లీ దిశానిర్థేశం: వర్ల రామయ్య


ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్సార్సీపీకి దిశానిర్థేశం చేయడం నిజం కాదా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ.. లోడీ హోటల్ లో విజయమ్మ రాహుల్ గాంధీతో సమావేశమై అక్కడి నుంచి జంతర్ మంతర్ కు వెళ్లింది నిజం కాదా? అని నిలదీశారు. ఓ రిమాండ్ ఖైదీ బెయిల్ పై విడుదలైతే జరిగిన ఊరేగింపును జగన్నాథ రథయాత్రతో పోల్చడం హిందూమతాన్ని కించపరచడమేనని అన్నారు. హిందూ మతంపై విశ్వాసం లేనంత మాత్రాన హైందవులను కించపరిచేలా రాయడం సరికాదని ఓ దిన పత్రికకు ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News