: సచిన్ రిటైరైతే ఏడ్చేస్తానంటున్న బ్యాటింగ్ స్టార్
భారత్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు టీమిండియా సహచరులూ వీరాభిమానులే. కెప్టెన్ ధోనీ సహా కొత్తగా జట్టులోకొచ్చే ఏ యువ క్రికెటర్ ను అడిగినా, 'సచినే ఆదర్శం' అనే మాట వినిపిస్తుంది. టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆ కోవలోకే వస్తాడు. ఇతగాడైతే.. సచిన్ రిటైరైతే ఏడ్చేస్తానంటున్నాడు. ఎన్టీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సచిన్ రిటైర్మెంటు ఆలోచన వస్తేనే భయం కలుగుతోందని చెప్పుకొచ్చాడు. మాస్టర్ ఆటకు వీడ్కోలు పలికిన రోజు దేశం యావత్తూ విచారంలో మునిగిపోతుందని అన్నాడు. తానైతే ఆ రోజున ఏడ్చేస్తానని చెప్పాడు.