: గాంధీజీ నడిచివచ్చి కేసీఆర్ మూతిమీద మూడు పీకాలి: ఎంపీ శివప్రసాద్


గాంధీజీ నడిచివచ్చి సోనియాకు ఒకటిచ్చుకుని, కేసీఆర్ మూతి మీద మూడు పీకాలని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. తిరుపతిలో ముసలమ్మ వేషధారణలో హల్ చల్ చేసిన శివప్రసాద్ గాంధీ జయంతి సందర్భంగా నిరసన తెలిపారు. గాంధీ గారు జరుగుతున్న దారుణాల్ని చూస్తూ అలాగే ఉండిపోకుండా మరో గాంధీగా రావాలని కోరారు. ప్రపంచంలోనే భారతీయ సంప్రదాయం అద్భుతమైనదైతే అందులో ఆంధ్రుల సంప్రదాయం అందమైనదని అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో 'జాగో భాగో' అనే మూర్ఖుడి వల్ల తీవ్ర విద్వేషాలు రేగే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News