: బంగ్లాదేశ్ లో విస్తరించిన అల్లర్లు.. 42 మంది మృతి


బంగ్లాదేశ్ లో నిన్న చెలరేగిన అల్లర్లు నేడు మరింత తీవ్రరూపం దాల్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా 42 మంది చనిపోయారు. 1971 యుద్ధ నేరాల కేసులో జమాతే-ఈ-ఇస్లామిక్ పార్టీ అధ్యక్షుడు దెల్వర్ హుస్సేన్ సయీద్ కు మరణశిక్ష విధిస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు అనంతరం ఇస్లామిక్ వాదులు పలు చోట్ల హింసకు పాల్పడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో పలువురు మరణించినట్టు తెలుస్తోంది. కాగా, అల్లర్లపై ఉక్కుపాదం మోపుతున్న బంగ్లా సర్కారు తాజాగా పారా మిలిటరీ దళాలను రంగంలోకి దింపింది.  

  • Loading...

More Telugu News