: గాంధేయ మార్గంలోనే ఉద్యమిస్తున్నాం: అశోక్ బాబు
గాంధేయ మార్గంలోనే తాము ఉద్యమిస్తున్నామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఉద్యోగ, విద్యార్థి సంఘాల ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నేతలు తమ వ్యాఖ్యల్లో ఉద్యోగుల ప్రస్తావన తేవద్దని కోరారు. తమ ఒత్తిడి వల్లే తెలంగాణ నోట్ పై కేంద్రం కొంత వెనక్కి తగ్గిందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మహాత్ముడి విగ్రహానికి అశోక్ బాబు వినతిపత్రం సమర్పించారు.