: అహింసా మార్గంలోనే తెలంగాణ సాధిస్తాం: కేటీఆర్


జాతిపిత గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాధిస్తామని టీఆర్ఎస్ నేత కె.తారకరామారావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాదులో కొందరు సభలు పెట్టి రెచ్చగొట్టినా, సంయమనంతో ఉంటామన్నారు. ఆంధ్రా నేతల నోట్ల కట్టలకు తెలంగాణ నోట్ ఆగిందా? అన్న అనుమానం ప్రజల్లో ఉందన్నారు. అయితే, ఈ నెలాఖరులోగా తెలంగాణ నోట్ శాసనసభకు రాకపోతే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని కేటీఆర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News