: జెల్లీ ఫిష్ ల ధాటికి మూతపడ్డ అతిపెద్ద అణు రియాక్టర్


ప్రపంచంలోనే అతి పెద్దదైన బాయిలింగ్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ మూతపడింది. ఇదేదో సునామీ ధాటికి మూతపడలేదు. జెల్లీ ఫిష్ (ఒకరకం సముద్రపు చేపలు)ల ధాటికి తలవంచింది. వివరాల్లోకి వెళ్తే... స్వీడన్ లో ఆగ్నేయ భాగాన ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ప్రపంచంలోనే పెద్దది. ఇందులో ఉన్నటువంటి మూడవ రియాక్టర్ ను అధికారులు ఆగమేఘాల మీద ఆపేశారు. టెక్నికల్ గా చూస్తే... న్యూక్లియర్ రియాక్టర్లలో పనిచేసే టర్బైన్లను చల్లగా ఉంచేందుకు ఎల్లప్పుడూ చల్లటి నీటిని పైపుల ద్వారా సరఫరా చేస్తుంటారు. లేకపోతే ఇవి పేలిపోతాయి. అందుకే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను సముద్ర తీరాల్లో లేదా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మిస్తారు.

అయితే, టర్బైన్లకు నీటిని సరఫరా చేసే పైపుల్లోకి టన్నుల కొద్దీ జెల్లీ ఫిష్ లు ఒక్కసారిగా చొరబడ్డాయి. దీంతో రియాక్టర్ ను షట్ డౌన్ చేశారు. ఈ కారణంగా 14 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పైపులను క్లీన్ చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే రియాక్టర్ ను పునఃప్రారంభిస్తామని ప్లాంట్ ఆపరేటర్ తెలిపారు.

గతంలో సునామీ దెబ్బకు జపాన్ లోని ఫుకుషిమా రియాక్టర్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. స్వీడన్ లోని రియాక్టర్ కూడా ఫుకుషిమా ప్లాంట్ కోవకు చెందినదే.

  • Loading...

More Telugu News