: గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల విడుదల లేనట్టే
గాంధీ జయంతిని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం తెలిసిందే. అయితే ఈ రోజు వీరి విడుదల లేనట్టేనని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... రాష్ట్ర వ్యాప్తంగా పలు కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న వారి విడుదలకు ఐదు రోజుల క్రితమే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే, ఈ ఏడాది కొత్తగా అమల్లోకి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం... ఖైదీల జాబితాను తయారుచేయడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో తమ వారి రాకకోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న ఖైదీల కుటుంబీకులకు నిరాశే మిగిలింది. ఈ నెల 26 నాటికి ఖైదీల జాబితాను ప్రభుత్వానికి పంపనున్నట్టు జైళ్ల శాఖ ఐజీ సునీల్ కుమార్ తెలిపారు. దీని తర్వాతే ఖైదీల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.