: మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి టీజీ
గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహాన్ని మంత్రి టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విదేశాల్లో గాంధీని గౌరవిస్తున్న స్థాయిలో మనం గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేసి వదిలేయకుండా... మహాత్ముడికి పూలమాలలు వేయించేలా ప్రముఖుల పర్యటనలను రూపొందించాలని సూచించారు.