: అరుణ్ జైట్లీ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు: షిండే
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాజ్యసభలోఈ రోజు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వివరణ ఇచ్చారు. సభలో ఈ అంశంపై చర్చ మొదలుకాగానే షిండే మాట్లాడుతూ.. జైట్లీ ఫోన్ ను ట్యాపింగ్ చేయలేదని తెలిపారు. కేవలం ఫోన్ నుంచి కాల్ వివరాలు మాత్రమే తీసుకున్నారన్నారు. ఏసీపీ ఈ మెయిల్ నుంచి ఫోన్ కాల్స్ వివరాలను కానిస్టేబుల్ అరవింద్ దబాస్ అనే ఢీల్లీ పోలీసు అక్రమంగా సేకరించాడని చెప్పారు.
అనంతరం వాటిని టెలికాం ఆపరేటర్లకు ఇచ్చి కాల్ డేటా వివరాలను అడిగాడని, అందులో పలువురు నాయకుల కాల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. ఫోన్ నంబర్లును నీరజ్ అనే వ్యక్తికి ఒక్కొక్కటి రూ.1500కు అమ్మాడని వివరించారు.
అయితే సభలో షిండే ప్రకటనకు సంతృప్తి చెందని బీజేపీ మండిపడింది. ఒక కానిస్టేబుల్ కు రాజకీయ నాయకుల కాల్ డేటాతో అవసరం ఏం ఉంటుందని ప్రశ్నించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో చెప్పాలని పార్టీ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.