: అరసవల్లి సూర్యనారాయణుడిపై ప్రసరించిన కిరణాలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యదేవాలయంలో స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ఐదునిమిషాల పాటు సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలపై పడటంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందారు. తొలిరోజైన నిన్న ఇక్కడి వాతావరణం మేఘావృతమై ఉండటంతో భానుడి కిరణాలు మూలవిరాట్టును తాకలేదు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.