: అక్కడ మగువలే మర్యాదస్తులట!
నలుగురి మధ్య కూర్చునే సమయంలో మగువలే చక్కగా కూర్చుంటారట. ఈ విషయంలో పురుషులతో పోల్చుకుంటే మగువలే చక్కగా ఎదుటివారిని గమనించి కూర్చుంటారని ఒక సర్వేలో తేలింది. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే సమయంలో పురుషులు జారగిలబడి కూర్చుంటారని, మహిళలు మాత్రం ఎదుటివారిని గమనించి ప్రవర్తిస్తారని ఒక సర్వేలో తేలింది.
విమానాల్లో ప్రయాణించే సమయంలో పురుషులకన్నా మగువలే మర్యాదగా ప్రవర్తిస్తారట. ఈ విషయం తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా సీట్లలో కూర్చునే సమయంలో పురుషులు పక్కన ఎలాంటి వారు కూర్చున్నారు? అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరట, జారగిలబడి కూర్చుంటారట. అదే మహిళలైతే ఎదుటి వ్యక్తులనుబట్టి ప్రవర్తిస్తారని ఈ అధ్యయనంలో తేలింది. పక్కసీటులో గర్భవతిగానీ, లేదా పెద్దవాళ్లుగానీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారుగానీ ఉంటే తాము సీట్లలో జారగిలబడి కూర్చుని విశ్రాంతి తీసుకోలేమని ఈ సర్వేలో పాల్గొన్న పలువురు మహిళలు చెప్పారట. వీరితో పోల్చుకుంటే ఇలా మర్యాదగా ఉండే పురుషుల సంఖ్య తక్కువేనట. రాత్రి సమయాల్లో తాము కాళ్లు చాపుకుని కూర్చుంటామని 69 శాతం మంది స్త్రీలు చెప్పగా, పురుషుల్లో 61 శాతం మంది మాత్రమే ఈ సమాధానాన్ని చెప్పారట.