: నదిలోనుండి జూపార్కుకు చేరుకున్న తాబేలు
నెహ్రూ జూపార్కులోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడు. ఆ సభ్యుడు ఎవరంటే తాబేలుగారు. ఈ తాబేలుగారు సుమారు రెండు వందల కిలోల బరువుంది. తుంగభద్ర నదిలో చేపలవేటకు వెళ్లిన వేటగాళ్లకు ఈ తాబేలుగారు పొరబాటున వలలో పడిపోయారు. ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సదరు తాబేలుగారిని పార్కుకు తరలించే చర్యలు తీసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం పుల్లూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి తుంగభద్ర నదిలో వేటకు వెళ్లాడు. అయితే చేపల సంగతి పక్కనపెడితే వలలో పెద్ద బరువు పడింది. దీంతో పెద్ద చేప పడివుంటుందని ఆశగా వల బయటికి తీసిన స్నేహితులకు అందులో భారీ తాబేలు దర్శనమిచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు ఈ తాబేలుగారిని చక్కగా జూపార్కుకు తరలించారు.