: రాజీనామా వార్తలను కొట్టిపారేసిన ప్రధాని మన్మోహన్
తన పదవికి రాజీనామా చేసినట్టు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొట్టిపారేశారు. నేరమయ రాజకీయ నాయకులను రక్షించే ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యతిరేక ప్రకటన చేయటంతో ఆయన నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధానమంత్రితో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాహుల్ తన వ్యాఖ్యలపై మన్మోహన్ కు వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.