: ఢిల్లీ చేరుకున్న బొత్స
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం కేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో ఆయన సమావేశం కానున్నారు. తర్వాత దిగ్విజయ్, పలువురు పార్టీ పెద్దలతో కూడా బొత్స భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్న ఆయన విభజన జరిగితే రాజీనామాలు చేస్తామని పెద్దలకు చెప్పనున్నారు.