: జగన్ సభకు అనుమతి ఇవ్వొద్దంటున్న నాగం
'సమైక్య శంఖారావం' పేరుతో ఈ నెల 19న హైదరాబాదులో వైఎస్సార్సీపీ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల్లో అలజడి సృష్టించేందుకే జగన్ సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ అమరుల అంతిమ యాత్రలకు అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి జగన్ సభ, ర్యాలీకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ఆలస్యమయ్యే కొద్దీ ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయని నాగం పేర్కొన్నారు.