: రూ. 240 కోట్లకు ముంచేసిన మైత్రి ఫైనాన్స్ చైర్మన్ అరెస్ట్
మైత్రి ఫైనాన్స్ గా పేరుగాంచిన మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీ కల్చర్... రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను మోసం చేసి రూ. 240 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. దీనికి సంబంధించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఖాసిం అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం కోసం గాలింపు మొదలుపెట్టారు. తప్పించుకు తిరుగుతున్న మైత్రి ఫైనాన్స్ చైర్మన్ లక్కు మాధవరెడ్డి, డైరెక్టర్లు చంద్రారెడ్డి, మాల్యాద్రిరెడ్డిలను ఎట్టకేలకు పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అనంతరం వీరిని కర్నూలు సబ్ జైలుకు తరలించారు.