: 2014 ఎన్నికలు కాంగ్రెస్,ఆర్ఎస్ఎస్ మధ్యే: జైరాం రమేష్
2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) మధ్యే జరుగుతాయని, ఇది కచ్చితమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేశ్ అన్నారు. మతశక్తులకు వ్యతిరేకంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జైరాం పైవిధంగా చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కనుసన్నల్లోనే బీజేపీ నడుస్తోందని జైరాం వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల సమయంలో బెంగాల్లో కాంగ్రెస్.. తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని స్పష్టం చేశారు.