: ఒంటికాలిపై లేచిన మంద కృష్ణ


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై విరుచుకుపడ్డారు. హైదరాబాదు నిజాం కాలేజీలో జరిగిన సకల జనుల భేరి సభ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంద కృష్ణ తీవ్రంగా ఖండించారు. పైగా ఆ సభలో కేసీఆర్ అగ్రకులాల వారికే ప్రాధాన్యమిచ్చారని దుయ్యబట్టారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో ఉన్నవాళ్ళందరూ తెలంగాణ ద్రోహులని కేసీఆర్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. తెలంగాణలో ఉన్నవాళ్ళందరూ తెలంగాణను కోరుకోవడంలేదని, అలాగే ఆంధ్రలో ఉన్నవాళ్ళంతా సీమాంధ్రను కోరుకోవడంలేదని అన్నారు.

సకల జనుల భేరి సందర్భంగా కేసీఆర్ దళితులను అవమానించారని ఆరోపించారు. ఆ సభలో ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ లతో పాటు విశ్వవిద్యాలయాలకు చెందిన దళిత విద్యార్థులకు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ పెద్దగా ప్రాధాన్యమివ్వకపోవడం కలచివేసిందన్నారు.

  • Loading...

More Telugu News