: ఆర్టీసీ కార్మిక నేతలతో ముగిసిన ఏకే ఖాన్ చర్చలు


తిరుపతిలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ చర్చలు ముగిశాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి నుంచి అదనపు బస్సులు తిప్పే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కొండపైకి 500కి పైగా బస్సులు తిరగాల్సి ఉండగా, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో 107 బస్సులే తిరుగుతున్నాయని అన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకే ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకొచ్చారు. అందుకే సమ్మె విరమించాలని తిరుపతి ఆర్టీసీ కార్మిక నేతలకు సూచించామని ఖాన్ వెల్లడించారు. ఇక, తిరుపతి బస్టాండులో సౌకర్యాలను పూర్తిస్థాయిలో మెరుగుపర్చుతామని తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల ఆరు డిపోల ఆధునికీకరణకు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News