: హైదరాబాదులో వైఎస్సార్సీపీ సభ పెట్టనివ్వం: హరీశ్ రావు
హైదరాబాదులో వైఎస్సార్సీపీ జరుపతలపెట్టిన సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, సమైక్య సభ పెడితే మానుకోట ఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్ నీతి, నిజాయతీ అంటుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని హరీశ్ అభిప్రాయపడ్డారు.