: షర్మిల వ్యాఖ్యలు వక్రీకరించవద్దు: కొణతాల
వైఎస్సార్సీపీ నేత షర్మిల హైదరాబాదు అంశంపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పై మండిపడ్డారు. మానుకోట ఘటన పునరావృతం అవుతుందని కేసీఆర్ హెచ్చరించడం సరికాదన్నారు. ఆ ఘటన వెనుక ఏ శక్తులు ఉన్నాయో అందరికీ తెలుసని అన్నారు. ఇక, అధినేత జగన్ చెప్పినట్టుగానే ఈనెల 15-20 తేదీల మధ్య హైదరాబాదులో సభ జరుపుతామని అన్నారు. రాజధాని కాబట్టే హైదరాబాదులో సభ జరపాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టడం తమ అభిమతం కాదన్నారు. వేర్పాటు వాద పార్టీలు, వ్యక్తులు సోదరభావంతో సభ నిర్వహణకు సహకరించాలని కొణతాల కోరారు.