: హెలి స్కాంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరణ
'అగస్టా వెస్ట్ లాండ్' కుంభకోణం వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. హెలి స్కాంలో సుప్రీం ఆధ్వర్యంలో స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వ్యాజ్యాన్ని తిరస్కరించింది.