: జైల్లో 'జడ్ ప్లస్' భద్రత కోరిన లాలూ!


కోట్ల రూపాయల దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిస్రాముండా జైల్లో కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు జైల్లో 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత కావాలని కోరారు. ఈ మేరకు ఆయన రాంచీ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. పరిశీలించిన కోర్టు లాలూ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ విషయాన్ని జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర పాండే తెలిపారు. ఎల్లుండి లాలూ సహా మిగతా 44 మందికి కోర్టు శిక్ష ఖరారు చేయనున్న సంగతి తెలిసిందే. రెండేళ్లకు పైగా శిక్ష పడితే లాలూ లోక్ సభ సభ్యత్వం వెంటనే రద్దు కానుంది.

  • Loading...

More Telugu News