: తీహార్ జైల్లో సందడి చేసిన విశ్వసుందరి
విశ్వసుందరి ఒలీవియా ఫ్రాన్సెస్ కల్పో తీహార్ జైలును సందర్శించింది. జైల్లో జరుగుతున్న హరిత ఉద్యమాన్ని ప్రశంసించింది. మరో ఏడాది గడిస్తే తీహార్ జైలు మరింత బాగుంటుందని వ్యాఖ్యానించింది. సెంట్రల్ జైలు నెంబర్.2ను సందర్శించిన ఒలీవియా అక్కడ రెండు గంటలు గడిపింది. జైలు ఫ్యాక్టరీలో ఖైదీలు తయారు చేసే వివిధ వస్తువులను, విశేషాలను జైళ్ల డైరెక్టర్ జనరల్ విమలా మెహ్రా దగ్గరుండి ఆమెకు వివరించారు.
జైలు బ్యాండ్ నిర్వహించిన 'ఫ్లయింగ్ సోల్స్' సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించింది. మహిళలపై హింసకు పాల్పడకుండా ఉంటామని ఖైదీలనుంచి మాట తీసుకుందీ అందగత్తె. భారత్ లో పది రోజులపాటు పర్యటించనున్న ఒలీవియా ఆడశిశువుల సంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్ పై అవగాహన తదితర కార్యక్రమాలను ప్రోత్సహించే కార్యక్రమాల్లో పాల్గొంటుంది.