: కాంగ్రెస్ మాజీ మంత్రి సస్పెన్షన్
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ మాజీ మంత్రి బాబూలాల్ నాగర్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. వివాహితకు ఉద్యోగం ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సెప్టెంబర్ 19న నాగర్ పై స్థానిక సోదాలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో, నాగర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు నాగర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలిపింది.