: విభజన వల్ల నీటి యుద్ధాలు తలెత్తవు: సుదర్శన్ రెడ్డి
రాష్ట్ర విభజన జరిగితే ఎలాంటి నీటి యుద్థాలు జరగవని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించడం లేదని అన్నారు. విభజన వల్ల నీటి కేటాయింపుల్లో ఇబ్బందులు వస్తాయన్న సీమాంధ్ర ప్రజల అనుమానాలు అర్థరహితమని స్పష్టం చేశారు. ఇప్పటికే కేటాయించిన నీటిని ఎక్కువ, తక్కువ చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. కేటాయింపుల ఆధారంగానే నీటి విడుదల జరుగుతుందని అన్నారు. విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాల నీటి వ్యవహారాలు పర్యవేక్షించే బోర్డు ఎలాంటి సమస్య లేకుండా నీటి కేటాయింపులు చేస్తుందని సుదర్శన్ రెడ్డి అన్నారు.