: రూపాయి విలువ నిలకడగా ఉండేలా చర్యలు: ఆర్థిక శాఖ
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ నిలకడగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 4.4 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి మాయారామ్ తెలిపారు. అమెరికాలో రాజకీయ అనిశ్చితి ప్రభావం మనపై ఉండదని స్పష్టం చేశారు. అమెరికా బడ్జెట్ త్వరగా ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.