: జగన్ సభను అడ్డుకుని తీరతాం: వీహెచ్
హైదరాబాదులో జగన్ ఏర్పాటు చేయతలపెట్టిన బహిరంగ సభను అడ్డుకుని తీరతామని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తానని తెలిపిన జగన్ సమైక్యవాణి ఎలా వినిపిస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలకు జగన్ ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అసలు ఆడని మ్యాచ్ లో చివరి బంతి ఎలా వేస్తారని వీహెచ్.. ముఖ్యమంత్రిని అడిగారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం జరిగిపోయిందని అన్న వీహెచ్, తక్షణం తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.