: మద్య నిషేధ యాత్ర కాస్తా.. లంక వ్యతిరేక యాత్ర అయింది!


జాతీయ స్థాయిలో తమిళ అభిమానాన్ని ఘనంగా చాటేవారిలో ఎండీఎంకే అధినేత వైగో ఎప్పుడూ ముందుంటారు. తమిళనాడుకు పొరుగున ఉండే శ్రీలంకలో తమ జాతీయులకు జరుగుతున్న అవమానాలపై నిత్యం రగిలిపోయే వాళ్లలోనూ వైగో పేరే ప్రముఖంగా చెప్పుకోవాలి. విలక్షణ ఉపన్యాసాలు, విచిత్రమైన ర్యాలీలకు ఆయన పెట్టిందిపేరు. తాజాగా మద్యనిషేధంపై యాత్ర అంటూ మొదలుపెట్టి చివరికి దాన్ని లంక వ్యతిరేక యాత్రగా మలిచిన తీరు దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది.

మొత్తం 350 మంది పాఠశాల విద్యార్థులను సమీకరించిన వైగో చెన్నైలో గురువారం ర్యాలీ నిర్వహించి లంక సైన్యం దురాగతాలను ఎండగట్టాడు. అయితే, ఆ చిన్నారులకు తాము ఎందుకు ఊరేగింపు చేయాలో ఎవ్వరికీ తెలియదట. అందరి ముఖాలకు ఎల్టీటీఈ దివంగత ఛీఫ్ ప్రభాకరన్ చిన్న కుమారుడు బాలచంద్రన్ మాస్కులను తగిలించారు. ఆ మాస్కులన్నీ సైన్యం చేతిలో బాలచంద్రన్ హతం కాక ముందు అమాయకంగా చూస్తున్నట్టున్న ఫొటోలను పోలి ఉన్నాయి.

వైగో.. ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ, 'బాల చంద్రన్ కూడా మీలాగే చిన్నవాడు. 12 ఏళ్ల కుర్రాడు. ఏం చేశాడని అతని అంగరక్షకులను పొట్టనబెట్టుకుని, అతన్నీ బుల్లెట్లతో ఛిద్రం చేశారు? ఈ రోజు మీరంతా తమిళులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేయడానికే ఇక్కడున్నారు' అని ఆవేశపూరితంగా ప్రసంగించారు. 

  • Loading...

More Telugu News