: సంజయ్ దత్ కు పెరోల్ గడువు పొడిగింపు


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు యరవాడ జైలు అధికారులు పెరోల్ గడువు పొడిగించారు. పదిరోజుల పెరోల్ ను 14 రోజులకు పెంచారు. కాలికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు రెండు రోజుల కిందటే సంజయ్ దత్ బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఆరోగ్య కారణాల రీత్యానే పెరోల్ గడువును పెంచారు. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసుల్లో శిక్ష పడిన సంజయ్ రెండు నెలల నుంచి పుణెలోని యరవాడ జైల్లో ఉంటున్నారు.

  • Loading...

More Telugu News