: శునకం కాల్పులతో రక్తపు మడుగులో యజమాని
శునకం చేతికి తుపాకీ చిక్కింది. ఇంకేముంది దడదడ మంటూ కాల్చి పారేసింది. దొంగలను అనుకుంటున్నారా? కాదు యజమానినే. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ చోద్యం చోటు చేసుకుంది.
పెంపుడు కుక్కంటే ఎవరికైనా ముద్దే. కొంత మందికి ప్రాణం కూడా. కనకపు సింహాసనముపైన శునకము కూర్చోబెడితే రాజు అవదుగా. కుక్క కుక్కే! మరి అలాంటి శునకం చేతికి తుపాకీ ఇస్తే ఏమవుతుంది? పైన చెప్పినట్లే జరుగుతుంది!
ఫ్లోరిడాకు చెందిన జార్జి లానియర్ ఒక శునకాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాడు. లానియర్ కు 9 ఎంఎం ఆటోమేటిక్ తుపాకీ ఉంది. దానిని ఉంచుకుంటే తన దగ్గర ఉంచుకోవాలి. లేదంటే ఇంట్లో జాగ్రత్త పరచాలి. కానీ, లానియర్ నిర్లక్ష్యంగా దాన్ని ఇంట్లోనే కింద పడేశాడు. ఇంకేం దానితో ఆడుకుంటూనే కాల్చడం నేర్చుకుంది కుక్క. తొలి ప్రయోగం యజమానిపైనే చేసింది. దాంతో కాలిలో తూటా దిగి లానియర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తుపాకీని అలా వదిలేసినందుకు లానియర్ తీరిగ్గా ఇప్పుడు లెంపలేసుకుంటున్నాడు.