: సింగరేణి లాభాల్లో 25 శాతం కార్మికులకు చెల్లించాలి


వరంగల్ జిల్లా భూపాలపల్లి ప్రాంతంలోని కాకతీయ గనులలో కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గనుల మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించారు. సింగరేణి కంపెనీకి వస్తున్న లాభాలలో కార్మికులకు 25 శాతం చెల్లించాలని, దీపావళి సందర్భంగా ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు మాట్లాడుతూ 'తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం' వైఫల్యం వల్లే కార్మికుల సమస్యలు పేరుకుపోతున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News